మా కుటుంబానికి సన్నిహిత మిత్రుడు వేణుమాధవ్: హీరో రాజశేఖర్

  • నన్ను ‘బావా’ అని, జీవితను ‘అక్కా’ అని పిలిచేవాడు
  • వేణుమాధవ్ మంచి మనిషి
  • ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లేవాడు
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని హీరో రాజశేఖర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా అందరినీ నవ్వించిన వేణుమాధవ్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి చెప్పారు. వేణుమాధవ్ తమ కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు అని, తనను ‘బావా’ అని, జీవితను ‘అక్కా’ అని ఆప్యాయంగా పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు.

వేణుమాధవ్ మంచి మనిషి అని, ప్రతి ఒక్కరినీ వరసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవాడని అన్నారు. గత వారం ఆసుపత్రిలో ఉన్న వేణుమాధవ్ ను కలిశానని, సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాడని చెప్పారు. అయితే, అతని ఆరోగ్య పరిస్థితి మళ్లీ సీరియస్ గా ఉండటంతో నిన్న ఆసుపత్రికి తరలించారని, ఈరోజు ఆయన మృతి వార్త వినాల్సి వచ్చిందని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Comedian
Venumadhav
Hero
Rajasheker

More Telugu News